: లాటరీలో 4,850 కోట్లు వచ్చాయి... ఆ డబ్బుని మంచం కింద దాచుకుంటానంటున్న యూఎస్ మహిళ!
యూఎస్ చరిత్రలోనే అతిపెద్ద సింగిల్ జాక్ పాట్ లాటరీ అది. మసాచుసెట్స్ కు చెందిన ఓ మహిళ, తాను ఎన్నడో కొనుక్కున్న టికెట్ కు తగిలింది. ఈ లాటరీలో ఆమె గెలుచుకున్న మొత్తం ఎంతో తెలుసా? సుమారు 4,850 కోట్లు. మావిస్ వాంక్ జిక్ అనే 53 ఏళ్ల మహిళకు ఈ లాటరీ లభించింది. చిన్న లాటరీ తగిలితేనే ఎగిరి, గంతేసి, అందరికీ చెప్పుకుంటాం. ఇక ఇంత భారీ లాటరీ తగిలిన సదరు మహిళ, డబ్బును ఏం చేసుకుంటారని ప్రశ్నిస్తే, అందరూ అవాక్కయ్యేలా, ప్రస్తుతానికి మంచం కింద దాచి పెట్టుకుంటానని చెబుతోంది మరి!