: ‘ఫిదా’ హీరోయిన్ సాయిపల్లవి నటించిన ‘హేయ్.. పిల్లగాడ’ టీజర్ విడుదల!
ఇటీవలే ‘ఫిదా’ సినిమాలో తెలంగాణ అమ్మాయి పాత్రలో నటించి అదుర్స్ అనిపించిన హీరోయిన్ సాయిపల్లవి త్వరలో ‘హేయ్.. పిల్లగాడ’ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. దుల్ఖర్ సల్మాన్, సాయిపల్లవి జంటగా మలయాళంలో వచ్చిన 'కలి' చిత్రాన్ని ‘హేయ్.. పిల్లగాడ’ పేరిట తెలుగులోకి డబ్ చేశారు. ఈ సినిమా టీజర్‌ను ఈ రోజు విడుదల చేశారు. ఇందులో ప్రధానంగా హీరో, హీరోయిన్లు కాలేజీ నేపథ్యంలో కనిపిస్తోన్న సీన్లు ఉన్నాయి. హీరో దుల్కర్ సల్మాన్ ఫైటింగులతో అదరగొడుతున్నాడు. ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందించాడు. సమీర్ తాహిర్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా వచ్చేనెల 8న విడుదల కానుంది.