: అత్యుత్సాహం ప్రదర్శించిన యువకులపై కలెక్టర్ ఆమ్రపాలి ఆగ్రహం
వినాయక చవితి సందర్భంగా ఖాజీపేటకు చెందిన కొందరు యువకులు వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి ఒడిలో వినాయకుడు ఉన్న కాన్సెప్ట్ తో విగ్రహాన్ని తయారు చేయించారు. నిమిషాల వ్యవధిలోనే దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ విషయాన్ని తెలుసుకున్న ఆమ్రపాలి అభ్యంతరం వ్యక్తం చేశారు. తన ఒడిలో వినాయకుడిని పెట్టడం ఏంటని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఆ ప్రతిమను తొలగించాలంటూ పోలీస్ సిబ్బందిని ఆదేశించారు. అప్పటికే ఈ విషయం గురించి తెలుసుకున్న యువకులు తాము తయారు చేయించిన విగ్రహానికి నల్లరంగు పూసి అక్కడ నుంచి తరలించారు.