: వరద బాధిత బిహార్‌కు ప్రధాని రూ. 500 కోట్ల సాయం
భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా వరదలతో కొట్టుమిట్టాడుతున్న బిహార్‌లోని 21 జిల్లాల పరిస్థితిని ప్రధాని మోదీ ఏరియల్ సర్వే ద్వారా సమీక్షించారు. ఆయనతో పాటు బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, డిప్యూటీ సీఎం సుశీల్ మోదీ కూడా ఉన్నారు. బిహార్ పరిస్థితి మెరుగుపడటం కోసం రూ. 500 కోట్లను తక్షణ సాయం కింద ప్రధాని మోదీ ప్రకటించారు. ఈ వరదల కారణంగా దాదాపు 2 కోట్ల మంది ఛిన్నాభిన్నమయ్యారు. 415 మంది ప్రాణాలు కోల్పోయారు. ముజఫర్‌నగర్, సమస్తిపుర్, దర్భంగా జిల్లాల్లో వరద ప్రభావం తీవ్రంగా ఉంది. బాగ్‌మతి, బుర్హీ గండక్ నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంలో ఈ జిల్లాల్లోని పట్టణాలు పూర్తిగా జలమయం అయ్యాయి.