: సంచలన తీర్పును వెలువరించిన సీబీఐ జడ్జికి భద్రత పెంచాలని ఆదేశించిన కేంద్రం!


ఆధ్యాత్మిక గురువు, డేరా సచ్చా సౌధ చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ ను రేప్ కేసులో దోషిగా తేల్చిన సీబీఐ జడ్జి జగదీప్ సింగ్ కు భద్రతను పెంచాలని హర్యాణా ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. గుర్మీత్ ను దోషిగా తేల్చిన నేపథ్యంలో ఆయన అనుచరులు ఆందోళనలకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. ఈ తీర్పు నేపథ్యంలో ఉత్తరాది రాష్ట్రాల్లో శాంతిభద్రతల సమస్యలు తలెత్తాయి. దీంతో, తీర్పును వెలువరించిన జడ్జి జగదీష్ సింగ్ కు ముప్పు పొంచి ఉందని... ఆయనకు పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేయాలని హర్యాణా ప్రభుత్వాన్ని కేంద్ర హోంశాఖ ఆదేశించింది. 

  • Loading...

More Telugu News