: `పైసా వసూల్` కోసం 'బిగ్‌బాస్' ఇంటికి బాలయ్య.. బాబాయ్, అబ్బాయ్ ఛాట్ షో?
సినిమా ప్రమోషన్లకు `బిగ్‌బాస్` లాంటి హై రేటింగ్ కార్యక్రమాలను వేదిక చేసుకోవడం కామనే. ఈ క్రమంలోనే ఇప్పటికే తెలుగు బిగ్‌బాస్‌కి వారానికో తార క్యూ కడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా కోసం హీరో రానా, ‘ఆనందో బ్రహ్మ’ ప్రమోషన్‌కు తాప్సీ, ‘అర్జున్ రెడ్డి’ ప్రచారం కోసం విజయ్ దేవరకొండ బిగ్‌బాస్ ఇంటికి వచ్చారు. త్వరలోనే `పైసా వసూల్` సినిమా ప్రమోషన్ కోసం బాలకృష్ణ బిగ్‌బాస్ హౌస్‌కి రానున్నారని ఫిల్మ్ నగర్ వర్గాలు చెప్పుకుంటున్నాయి.
ఈ వార్తలో నిజమెంతుందో తెలియకపోయినా `అబ్బాయి కార్యక్రమానికి బాబాయ్` అంటూ అప్పుడే అభిమానులు ఫేస్‌బుక్ పోస్టులు ప్రారంభించారు. ‘పైసా వసూల్’ సెప్టెంబర్ 1న విడుదల కాబోతోంది. గతంలో వారిద్దరి మధ్య విభేదాలు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఒకవేళ బాలయ్య బిగ్‌బాస్ కార్యక్రమానికి విచ్చేస్తే, ఆ వార్తల్లో నిజం లేదనే విషయం కచ్చితంగా తెలుస్తుందని ఇరు నటుల అభిమానులు ఆశ పడుతున్నారు. ఏం జరుగుతుందో తెలియాలంటే వేచి చూడాలి మరి!