: 26 ఏళ్లప్పుడు ఇన్ఫోసిస్‌లో చేరాను... 62 ఏళ్లు వచ్చాక తిరిగి చేరుతున్నాను...నందన్ నీలేకని ట్వీట్
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. ఇన్వెస్టర్లు, ఇతర సహ వ్యవస్థాపకుల ఒత్తిడి మేరకు చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన ఆయన తన ఆనందాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. `26 ఏళ్ల వయసులో ఇన్ఫోసిస్‌లో చేరాను. మళ్లీ 62 ఏళ్లు వచ్చాక తిరిగి చేరుతున్నాను. జీవితం గుండ్రంగా తిరగడమంటే ఇదే!` అని ఆయన ట్వీట్ చేశారు. చైర్మన్, నాన్-ఎగ్జిక్యూటివ్, నాన్-ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన ఆయన సొంతగూటికి తిరిగి చేరుకోవడంపై ఆనందం వ్యక్తం చేశారు.