: కేంద్ర మంత్రివర్గ విస్తరణ దృష్ట్యా అమిత్ షా విజయవాడ పర్యటన వాయిదా
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం కేంద్ర మంత్రివర్గ విస్తరణ చేయాలని భావిస్తోన్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా విజయవాడ పర్యటన వాయిదా పడింది. ఈ నెల 28 నుంచి 30 వరకు ఆయన విజయవాడలో పర్యటించాల్సి ఉన్న విషయం తెలిసిందే. పర్యటన వాయిదా పడడంతో ఆయన వచ్చేనెల విజయవాడకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, రేపు కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరగనున్నట్లు తెలుస్తోంది. చురుకుగా పనిచేయని కేంద్ర మంత్రులపై వేటు పడే అవకాశం ఉంది. కొందరు జేడీయూ నేతలు మోదీ కేబినెట్‌లోకి రావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.