: కొత్త రూ. 200, రూ. 50 నోట్లను డ్రా చేసుకునేందుకు క్యూ కడుతున్న జనం
భారతీయ రిజర్వ్ బ్యాంకు నేటి నుంచి అమల్లోకి తీసుకువచ్చిన రూ. 200, రూ. 50 నోట్లను డ్రా చేసుకునేందుకు దేశవ్యాప్తంగా ప్రజలు రిజర్వు బ్యాంకు శాఖల ముందు బారులు తీరుతున్నారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత విడుదల చేసిన చిన్న మారక నోట్లు ఇవే. ఈ నోట్లను డ్రా చేసుకున్న వారు వీటితో దిగిన సెల్ఫీలను సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేస్తున్నారు. కేవలం రూ. 2000, రూ. 500 ఉండటం వల్ల ఏర్పడిన చిల్లర కొరత ఈ నోట్ల అమలుతో తగ్గనుంది. ఆర్బీఐ రూ. 200 నోటును జారీ చేయడం ఇదే మొదటిసారి.