: ఆపిల్ నుంచి భారీ స్టోరేజీ ఫోన్.. 512 జీబీ ఇన్‌బిల్ట్ మెమొరీతో వచ్చేస్తోన్న ఐఫోన్ 8


ఆపిల్ నుంచి మరో బ్రహ్మాండమైన ఫోన్ వచ్చేస్తోంది. వచ్చే నెలలో జరగనున్న ఐఫోన్ పదేళ్ల వార్షికోత్సవంలో ఈ ఫోన్‌ను లాంచ్ చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో ఐఫోన్ 8‌తోపాటు ఐఫోన్ 7 ఎస్, 7ఎస్ ప్లస్ స్మార్ట్‌ఫోన్లను కూడా విడుదల చేయనున్నట్టు సమాచారం. అయితే టెక్ వర్గాలు మాత్రం ఐఫోన్ 8పై ఫోకస్ పెట్టాయి. సెప్టెంబరు 12న విడుదల చేయనున్నట్టు చెబుతున్న ఈ ఫోన్ అంతర్గత మెమొరీ 512 జీబీలు ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు.

అయితే ఆపిల్ నుంచి మాత్రం ఇప్పటి వరకు ఎటువంటి సమాచారం లేదు. ఐఫోన్ 8.. 64 జీబీ, 256 జీబీ, 512 జీబీ మూడు వేరియంట్లలో వస్తున్నట్టు తెలుస్తోంది. విడుదల చేసిన వారంలోనే ముందస్తు బుకింగులు కూడా ప్రారంభం కానుండగా సెప్టెంబరు 22 నుంచి వినియోగదారులకు అందుబాటులో వచ్చే అవకాశం ఉందని సమాచారం.

 
 

  • Loading...

More Telugu News