: మొద‌టి రోజు క‌లెక్ష‌న్ల‌లో `క‌బాలి`ని దాటేసిన అజిత్ `వివేగం`


ఓపెనింగ్ క‌లెక్ష‌న్ల విష‌యంలో త‌మిళ న‌టుడు అజిత్, ర‌జ‌నీకాంత్ రికార్డును దాటేశాడు. ఆయ‌న `వివేగం` సినిమా చెన్నైసిటీలో మొద‌టి రోజు రూ. 1.21 కోట్లు రాబ‌ట్టిన‌ట్లు తెలుస్తోంది. `క‌బాలి` చిత్రం సృష్టించిన‌ రూ. 1.12 కోట్ల మొద‌టి రోజు క‌లెక్ష‌న్ల‌ మార్కును ఈ చిత్రం దాటేసింది. ఇందులో కాజల్‌, వివేక్‌ ఓబెరాయ్‌, అక్షర హాసన్‌లు కీల‌క పాత్ర‌లు పోషించారు. దీనికి శివ దర్శకత్వం వహించగా అనిరుధ్ స్వ‌రాలు అందించారు.

మొద‌టి రోజే మంచి టాక్‌తో చెన్నై సిటీ బాక్సాఫీసు వద్ద వసూళ్ల వ‌ర్షం కురిపించింది. ఇదిలా ఉండ‌గా గ‌తంలో విజయ్ న‌టించిన‌ ‘తెరి’ చిత్రం రూ. 1.05 కోట్లు రాబ‌ట్టింది. అలాగే అమెరికాలో కూడా ‘వివేగం’ సినిమా భారీ వ‌సూళ్లు రాబ‌డుతోంది. అక్క‌డ మొద‌టి రోజు రూ. 1.37 కోట్లు రాబట్టిన‌ట్లు స‌మాచారం.

  • Loading...

More Telugu News