: మళ్లీ పేలిన రెడ్‌మీ నోట్ 4.. తప్పిన పెను ప్రమాదం.. చార్జింగ్ పెట్టిన కాసేపటికే పేలుడు!
చైనా మొబైల్ మేకర్ షియోమీకి చెందిన రెడ్‌మీ నోట్ 4 స్మార్ట్‌ఫోన్ మరోమారు పేలింది. విశాఖపట్టణం జిల్లా అచ్యుతాపురం మండలం రామన్నపాలెంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గంధం సాయి పాలిటెక్నిక్ రెండో ఏడాది చదువుతున్నాడు. నాలుగు నెలల క్రితం సాయి రెడ్‌మీ నోట్4 కొనుగోలు చేశాడు. గురువారం మధ్యాహ్నం ఫోన్‌కు చార్జింగ్ పెట్టిన కాసేపటికే మంటలు చెలరేగి ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలిపోయింది. గమనించిన సాయి అక్కడి నుంచి దూరంగా పరిగెత్తడంతో పెను ప్రమాదం తప్పింది. కాగా, ఇటీవల తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలోనూ రెడ్‌మీ నోట్ 4 పేలిన సంగతి తెలిసిందే. ప్యాంటులో పెట్టుకున్న ఫోన్ పేలిపోవడంతో యువకుడికి గాయాలయ్యాయి.