: తిరుమలలో సందడి చేసిన సమంత.. శ్రీవారికి పత్యేక పూజలు.. సెల్ఫీల కోసం పోటీపడిన ఆలయ సిబ్బంది
ప్రముఖ సినీ నటి, అక్కినేని వారి కాబోయే కోడలు సమంత ఈ తెల్లవారుజామున తిరుమల శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసింది. తిరుమల చేరుకున్న ఆమెకు టీటీడీ అధికారులు ఘన స్వాగతం పలికారు. సమంతను చూసేందుకు జనాలు ఎగబడ్డారు. ఆలయ సిబ్బంది ఆమెతో సెల్ఫీలు దిగేందుకు పోటీలు పడ్డారు. వినాయక చవితి సందర్భంగా స్వామి వారికి సమంత ప్రత్యేక పూజలు నిర్వహించినట్టు ఆలయ అధికారులు తెలిపారు. పెళ్లికి ముందు సమంత ఒంటరిగా శ్రీవారిని దర్శించుకోవడానికి రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.