: సినిమా చూసొచ్చి ఆత్మహత్య చేసుకున్న మెడికో.. చదవలేకేనని సూసైడ్ నోట్!


ఒంగోలులోని రిమ్స్ ప్రభుత్వ ఆసుపత్రిలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న తెలంగాణ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా మరిపెడకు చెందిన గుగులోతు మనోకృష్ణ (20) రిమ్స్‌లో రెండో ఏడాది చదువుతున్నాడు. గత శనివారం ఇంటికొచ్చిన మనోకృష్ణ అప్పటి నుంచి ముభావంగా ఉంటున్నాడు. గమనించిన తండ్రి ఆరా తీయగా ఏమీ లేదని, బాగానే ఉన్నానని సమాధానమిచ్చాడు.

కాగా, గురువారం సినిమాకు వెళ్లిన మనోకృష్ణ ఇంటికొచ్చి ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు రాసిన సూసైడ్ నోట్‌ ఘటనా స్థలంలో లభ్యమైంది. తల్లిదండ్రులు కోరుకున్నట్టుగా తాను చదవలేకపోతున్నానని, తనను క్షమించాలని అందులో వేడుకున్నాడు. డాక్టర్ చదివి ప్రయోజకుడవుతాడనుకున్న కొడుకు ఇలా తనువు చాలించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.


 

  • Loading...

More Telugu News