: మోదీ, అమిత్ షా మంతనాలు.. ఎల్లుండి కేంద్ర మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ.. ఏడుగురు కేంద్ర మంత్రులపై వేటు?
కేంద్ర మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణపై ఢిల్లీలో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఈ అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, భారతీయ జనతా పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా భేటీ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం ఎల్లుండి మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణ చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. మోదీ, అమిత్ షా జరుపుతున్న ఈ చర్చకు బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులు కూడా హాజరవుతున్నారు. మోదీ కేబినెట్‌లో సీనియర్ శాఖల్లోనూ మార్పులు చేయాలని భావిస్తున్నారు. ఎవరి పదవి ఉంటుందో, ఎవరిపై వేటు పడుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. ఏడుగురు కేంద్ర మంత్రులపై వేటు పడే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.