: హైద‌రాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం!


హైద‌రాబాద్‌లోని ప‌లు ప్రాంతాల్లో ఈ రోజు ఓ మోస్త‌రు వ‌ర్షం ప‌డింది. సైనిక్ పురి, కాప్రా, ఏఎస్ రావున‌గ‌ర్‌, సికింద్రాబాద్‌, మారేడ్ ప‌ల్లి, బేగంపేట‌, అడ్డ‌గుట్ట‌, బోయినప‌ల్లి, తిరుమ‌ల‌గిరి, రామాంత పూర్‌, మ‌ల్కాజ్‌గిరి, ఉప్ప‌ల్, యూస‌ఫ్ గూడ, ఎస్సార్ న‌గ‌ర్, పంజాగుట్ట ప్రాంతాల‌తో పాటు మ‌రికొన్ని ప్రాంతాల్లో వ‌ర్షం ప‌డింది. వ‌ర్షం కార‌ణంగా కొన్ని ప్రాంతాల్లో వాహ‌నాలు మెల్లగా క‌దులుతున్నాయి. పలు చోట్ల రహదారులపై నీళ్లు నిలిచాయి. వర్షం ధాటికి నగరంలోని మిర్యాలగూడలో పరిస్థితి దారుణంగా మారింది. అక్కడి ప్రాంతంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. 

  • Loading...

More Telugu News