: గుడిలో పూజారులపై కూడా రౌడీషీట్ తెరిపించిన ఘనత శిల్పా సోదరులది: అభిరుచి మధు


నంద్యాలలో ఈరోజు కాల్పుల కలకలం చెలరేగిన సంగతి తెలిసిందే. వైసీపీ నేత శిల్పా చక్రపాణి రెడ్డి, టీడీపీ నేత అభిరుచి మధు వర్గీయుల మధ్య జరిగిన దాడితో నంద్యాలలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఈ నేపథ్యంలో, మధు గన్ మెన్ గాల్లోకి కాల్పులు జరిపాడు. అనంతరం శిల్పా చక్రపాణి రెడ్డి మాట్లాడుతూ మధు ఓ రౌడీషీటర్ అని అన్నారు.

ఈ వ్యాఖ్యలపై మధు స్పందిస్తూ, నంద్యాలలో ప్రతి ఒక్కరిపై రౌడీషీట్ ను ఓపెన్ చేయించడం శిల్పా సోదరులకు అలవాటని... చివరకు గుళ్లోని పూజారులపై కూడా రౌడీ షీట్ తెరిపించేంత ఘనత వారిదని విమర్శించారు. తనపై ఉన్న రౌడీషీట్ ను క్లోజ్ చేయమని కోర్టు ఎప్పుడో చెప్పిందని తెలిపారు. నంద్యాల పట్టణం ప్రశాంతంగా ఉండాలనే తాను కోరుకుంటున్నానని... తనను చంపాలనేదే వారి కోరికైతే, వారి ఇంటికి వెళ్లి ప్రాణాలు అర్పించడానికి కూడా తాను సిద్ధమని చెప్పారు.

  • Loading...

More Telugu News