: బిచ్చగత్తె దగ్గర డబ్బులు లాక్కున్న హెడ్‌కానిస్టేబుల్ అరెస్టు... వీడియో చూడండి!
జమ్మూ కాశ్మీర్‌లోని రాంబన్ జిల్లా రహదారి మీద బిచ్చమెత్తుకుంటున్న మహిళ దగ్గర దౌర్జన్యంగా డబ్బులు లాక్కుంటూ కెమెరాకు చిక్కిన హెడ్ కానిస్టేబుల్ మున్వార్ హుస్సేన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయాన్ని రాంబన్ ప్రాంత సీనియర్ ఎస్‌పీ మోహన్ లాల్ స్పష్టం చేశారు. బిచ్చగత్తె దగ్గర మున్వార్ డబ్బులు లాక్కుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మద్యపానానికి బానిసైన కారణంగా గతంలో పనిచేసిన కిష్ట్వార్ పోలీసు స్టేషన్ నుంచి మున్వార్‌ను రాంబన్‌కు బదిలీ చేశారు. అక్కడి పోలీసు స్టేషన్‌లో కూడా మున్వార్ ప్రవర్తనపై ఫిర్యాదులు ఉన్నాయని మోహన్ లాల్ తెలిపారు.