: రేపు అక్కడికి రండి చూసుకుందాం.. బస్తీ మే సవాల్: వీహెచ్ కి సవాల్ విసిరిన రామ్ గోపాల్ వర్మ
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘అర్జున్ రెడ్డి’ సినిమా పోస్టర్లు అభ్యంతరకరంగా ఉన్నాయని మండిపడ్డ కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు... ఆ పోస్టర్లను సమర్థిస్తోన్న రామ్ గోపాల్ వర్మని హైదరాబాద్లో అడుగుపెట్టనివ్వబోమని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. తాజాగా వీహెచ్ కి రామ్ గోపాల్ వర్మ ఓ సవాల్ విసిరాడు. ‘వీహెచ్ సారూ... నేను రేపు పొద్దున 10.30 గంటలకు ప్రసాద్ ఐమ్యాక్స్ లో మార్నింగ్ షోకి వస్తున్నా... అక్కడ చూసుకుందాం.. బస్తీ మే సవాల్’ అని రామ్ గోపాల్ వర్మ సవాల్ విసిరాడు.
అలాగే, తనను హైదరాబాద్లో అడుగు పెట్టకుండా చేయడం కన్నా వీహెచ్కి దమ్ముంటే ఆయన మనవళ్లు, మనవరాళ్ల వయసు ఉండే అబ్బాయిలను, అమ్మాయిలను ‘అర్జున్ రెడ్డి’ సినిమా ఆడుతున్న థియేటర్లోకి అడుగు పెట్టకుండా చేయాలని మరో సవాల్ విసిరాడు.