: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్.. 800వ వన్డేలో అయినా శ్రీలంక మెరుస్తుందా?


శ్రీలంకతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. పల్లెకెలాలో జరుగుతున్న ఈ మ్యాచ్ కు ఎలాంటి మార్పులు లేకుండానే భారత్ బరిలోకి దిగింది. మరోవైపు శ్రీలంక జట్టులో మూడు మార్పులు జరిగాయి. తిషారా, వానిడు, సందకన్ లు తుది జట్టులో చోటు కోల్పోయారు. వీరి స్థానంలో దుష్మంతా, అకిలా ధనంజయ, మిలింద సిరివర్దనలు జట్టులోకి వచ్చారు. ఆసక్తికర విషయం ఏమిటంటే శ్రీలంకకు ఇది 800వ వన్డే మ్యాచ్. చారిత్రాత్మకమైన ఈ మ్యాచ్ లో శ్రీలంక విజయం సాధిస్తుందా? లేక అన్ని విభాగాల్లో బలీయంగా ఉన్న టీమిండియా ముందు మరోసారి మోకరిల్లుతుందా? అనే విషయాన్ని వేచి చూడాలి.

  • Loading...

More Telugu News