: అభిరుచి మధు మాపై గన్ మెన్ తో కాల్పులు జరిపించాడు: శిల్పా చక్రపాణిరెడ్డి


టీడీపీ, వైసీపీ నేతల ఘర్షణతో నంద్యాల పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. స్థానికంగా ఉన్న సూరజ్ గ్రాండ్ హోటల్ వద్ద ఇరు వర్గాలకు చెందిన శ్రేణులు రెచ్చిపోయి, దాడులకు తెగబడ్డాయి. వైసీపీ నేత శిల్పా మోహన్ రెడ్డి, టీడీపీ నేత అభిరుచి మధుల అనుచరులు బాహాబాహీకి దిగారు. పరస్పరం రాళ్ల దాడికి తెగించారు. ఈ నేపథ్యంలో మధుకు చెందిన ఆడీ కారు అద్దాలు ధ్వంసమయ్యాయి.

ఈ సందర్భంగా శిల్పా చక్రపాణిరెడ్డి మాట్లాడుతూ, మధు ఓ రౌడీ షీటర్ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రైవేట్ గన్ మెన్ తో తమపై కాల్పులు జరిపించాడని అన్నారు. కారును పక్కకు తీయాలని అడిగినందుకే ఇంతగా రెచ్చిపోయాడని మండిపడ్డారు. అధికార పార్టీ నేతననే ధైర్యంతో దారుణంగా వ్యవహరించాడని... నిన్న తమ పార్టీ కౌన్సిలర్ ను కూడా కొట్టాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సూరజ్ హోటల్ వద్ద 144 సెక్షన్ ను విధించారు.

  • Loading...

More Telugu News