: 'అర్జున్ రెడ్డి' సినిమాపై వీహెచ్ ఫైర్.. సెన్సార్ బోర్డు కార్యాలయం ఎదుట ఆందోళన
వినాయకచవితి సందర్భంగా విడుదలవుతున్న 'అర్జున్ రెడ్డి' సినిమాపై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు మండిపడ్డారు. ఈ సినిమాలో అసభ్యకరమైన సన్నివేశాలు ఉన్నాయని ఆరోపిస్తూ ఈరోజు ఆయన హైదరాబాదులోని సెన్సార్ బోర్డ్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. యువత పెడదారి పట్టేలా ఈ సినిమా ఉందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
పవిత్రమైన వినాయకచవితి రోజున ఇలాంటి నీచమైన సినిమాలు రావడమేంటని ప్రశ్నించారు. హీరో, హీరోయిన్లు లిప్ లాక్ చేసిన పోస్టర్లను బస్సులకు అతికించారని... వీటి వల్ల రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయని మండిపడ్డారు. ఇలాంటి పోస్టర్లను వేయకూడదని ఆయన అన్నారు.