: అర్జున్ కపూర్ సరసన శ్రద్ధా కపూర్ కాదు... కృతి సనన్?
అర్జున్ కపూర్ హీరోగా రాజ్ అండే డీకే దర్శకత్వంలో రానున్న `ఫర్జీ` చిత్రంలో హీరోయిన్‌గా శ్రద్ధా కపూర్‌ను అనుకున్నారు. కానీ కథపై ఆమె పెద్దగా ఆసక్తి చూపించకపోవడంతో ఆ స్థానంలో కృతి సనన్‌ను తీసుకునేందుకు చిత్రయూనిట్ మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. గత మూడేళ్ల నుంచి ఈ చిత్రానికి సంబంధించి నటీనటుల ఎంపిక జరుగుతూనే ఉంది. అయినా ఏదో ఒక కారణంగా దీని చిత్రీకరణ వాయిదా పడుతూనే ఉంది. ఇప్పుడైనా ఈ చిత్రం పట్టాలెక్కుతుందో లేదో మరి!