: 'ఉదయ న్యూస్' ఛానల్ మూతపడుతోంది..!


కన్నడలో ఓ న్యూస్ ఛానెల్ మూతపడనుంది. కర్ణాటకలో ఎప్పటి నుంచో వున్న ప్రముఖ న్యూస్ ఛానల్ ‘ఉదయ న్యూస్’ను మూసివేయనున్నట్టు సన్ నెట్ వర్క్ ప్రకటించింది. సన్ నెట్ వర్క్ కు చెందిన ఉదయ న్యూస్ సుదీర్ఘ కాలంగా 24 గంటల వార్తలను అందిస్తూ వచ్చింది. అయితే ప్రేక్షకాదరణ మూటగట్టుకోవడంలో విఫలమయ్యామని, న్యూస్ ఛానల్ నష్టాల బారిన పడిందని, న్యూస్ ఛానల్ నిర్వహణ భారంగా మారిందని, అందుకే ఛానల్ ను మూసివేయాలనే నిర్ణయానికి వచ్చామని సన్ నెట్ వర్క్ యాజమాన్యం ప్రకటించింది.

ఈ మేరకు కర్ణాటక లేబర్ మినిస్ట్రీకి సమాచారం అందించింది. ఈ నెల 24 నుంచి అంటే నేటి నుంచి వార్తల ప్రసారాలు ఆపేస్తున్నామని, తమ సంస్థలో పని చేస్తున్న 73 మంది ఉద్యోగులను వదులుకుంటున్నామని సన్ నెట్ వర్క్ తెలిపింది. ఈ మేరకు ఉద్యోగులకు సమాచారం అందించామని తెలిపింది. ప్రైవేట్ ఛానల్స్ మధ్య పోటీని తట్టుకోలేకపోయామని, న్యూస్ ఛానల్ గా అలరించడంలో విఫలమయ్యామని ఉద్యోగులు పేర్కొన్నారు. కాగా సన్ నెట్ వర్క్ కు కన్నడలో ఉదయ టీవీ, ఉదయ మ్యూజిక్, ఉదయ మూవీస్, ఉదయ కామెడీ ఛానల్స్ ఉన్నాయి. వీటి రెవెన్యూ బాగానే ఉందని సన్ నెట్ వర్క్ తెలిపింది. 

  • Loading...

More Telugu News