: మెట్లపైనుంచి జారిపడ్డ వైసీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి.. విరిగిన కాలు ఎముక!
విశాఖపట్నం జిల్లా పాడేరు వైసీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ప్రమాదానికి గురయ్యారు. మెట్లపై నుంచి ఆమె జారి పడటంతో, కాలుకు తీవ్ర గాయమైంది. మొన్నటి దాకా నంద్యాల ఉప ఎన్నికలో ప్రచారం నిర్వహించిన ఆమె... ప్రస్తుతం కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా అక్కడ ఉన్నారు.
ఈ సందర్భంగా కాకినాడలో ఆమె బసచేసిన భవనంలో మెట్లు దిగుతుండగా, కాలు జారి పడిపోయారు. చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్లిన ఆమెకు ఎక్స్ రే తీయగా ఎడమ కాలులోని ఎముక విరిగినట్టు తేలింది. అనంతరం చికిత్స పొందిన ఆమె... విశ్రాంతి కోసం పాడేరు చేరుకున్నారు.