: తేజస్వియాదవ్ ను ‘బాహుబలి’గా అభివర్ణిస్తూ ఫ్లెక్సీలు!
బీహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ ను ‘బాహుబలి’గా ఆయన అభిమానులు అభివర్ణించారు. ఈ నేపథ్యంలో బాహుబలి డ్రెస్సులో ఉన్న తేజస్వియాదవ్ హోర్డింగ్సు ను, పోస్టర్లను, ఫ్లెక్సీలను ఆయన అభిమానులు ఏర్పాటు చేశారు. నితీశ్ కుమార్ మహాకూటమి నుంచి తప్పుకుని, బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన అనంతరం, తేజస్వి యాదవ్ తన కార్యక్రమాలను వేగవంతం చేశారు. కాగా, బీహార్ ప్రభుత్వాన్ని కుదిపేస్తున్న శ్రీజన్ కుంభకోణం విషయమై తేజస్వియాదవ్ మాట్లాడుతూ, ఈ కుంభకోణానికి సంబంధించి సీబీఐ ఇప్పటివరకు దర్యాప్తు ప్రారంభించలేదని, దీని వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.