: నిర్లక్ష్యానికి పరాకాష్ట... గాయపడ్డ వ్యక్తి చావుకు కారణమైన రైల్వే పోలీసులు.... వీడియో చూడండి
రైలు నుంచి కిందపడి తీవ్రంగా గాయపడ్డ వ్యక్తిని ఆసుపత్రికి తీసుకెళ్లకుండా, తీరిగ్గా ఆ తర్వాత వచ్చిన రైల్లో పడేసి ఆలస్యం చేయడం ద్వారా ఆ వ్యక్తి మరణానికి కారణమయ్యారు ముంబై రైల్వే పోలీసులు. జూలై 23న జరిగిన ఈ సంఘటన సీసీ కెమెరాల ఫుటేజీ ద్వారా బయటపడటంతో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసును సస్పెండ్ చేశారు. అతనికి సహాయం చేసిన హోంగార్డుపై చర్యలు తీసుకున్నారు. ముంబైలోని సంపద రైల్వే స్టేషన్‌లో వేగంగా వెళ్తున్న రైలు నుంచి వ్యక్తి కిందపడటం, తర్వాత కొన్ని గంటలకు తీవ్రంగా గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తీసుకెళ్లకుండా జీఆర్‌పీ పోలీసు కానిస్టేబుల్, అక్కడి హోంగార్డు సాయంతో మరో రైల్లో పడేయడం వీడియోలో చూడొచ్చు. దాదాపు 10 గంటల తర్వాత ఓ ప్రయాణికుడు పోలీసులకు సమాచారం ఇవ్వగా, గాయపడిన వ్యక్తిని దగ్గర్లోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆసుపత్రికి రావడానికి ముందే అతను మరణించాడని డాక్టర్లు స్పష్టం చేశారు.