: జగన్ కడప జిల్లా పరువు తీసేస్తున్నారు: మంత్రి ఆదినారాయణ రెడ్డి
వైసీపీ అధినేత జగన్ పై ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాణాలతో ఉండకూడదనేదే జగన్ కోరిక అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిని కాల్చి చంపాలని జగన్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించడం శుభపరిణామమని... జగన్ పై వెంటనే కేసు నమోదు చేయాలంటూ ఆదేశాలు జారీ చేయడం ఆహ్వానించదగ్గ పరిణామమని అన్నారు. మరో మంత్రి ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ, ప్రతిపక్ష నేతగా జగన్ అనర్హుడని ఎద్దేవా చేశారు. జగన్ తీరుతో కడప జిల్లా పరువు పోతోందని అన్నారు.