: పోలింగ్ 80 శాతం వరకూ జరిగే అవకాశం ఉంది: భూమా బ్రహ్మానందరెడ్డి
నంద్యాల ఉప ఎన్నికలో ఇప్పటికే సుమారు 65 శాతం వరకు పోలింగ్ జరిగిందని టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, దాదాపు అన్ని పోలింగ్ కేంద్రాల్లో 55 శాతం కంటే పైగానే పోలింగ్ జరిగిందని, ఎక్కువ శాతం మంది మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని అన్నారు. కొన్ని చోట్ల ఏవీఎంలు మొరాయించడంతో గంట సేపు ఆలస్యమైందని, మిగతా చోట్ల చాలా ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్నాయని అన్నారు. ఈ ఎన్నికల్లో 80 శాతం వరకూ పోలింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయని, 90 శాతం పోలింగ్ జరిగినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని భూమా బ్రహ్మానందరెడ్డి అభిప్రాయపడ్డారు.