: మీరు మారాలి... మీరే ప్రజల వద్దకు వెళ్లాలి: ప్రభుత్వ ఉద్యోగులకు హైదరాబాదు కలెక్టర్ యోగితా రాణా క్లాస్


హైదరాబాదు జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన రోజే "ఇంత వరకు ఒక లెక్క. ఇకపై ఒక లెక్క. పని విషయంలో మీనమేషాలు లెక్కిస్తానంటే కుదరదు" అంటూ అధికారులకు హెచ్చరికలు జారీ చేసిన యోగితా రాణా అన్నట్టుగానే అధికారులను హడలెత్తిస్తున్నారు. రోజూ సమీక్షలు, సమావేశాలతో అధికారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. సర్టిఫికెట్లు అందడం లేదన్న ఫిర్యాదుల నేపథ్యంలో రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించిన యోగితా రాణా... వారిని ఉద్దేశించి, 'మీరు మారాలి, ఎప్పటిలాగే ఉంటామంటే కుదరద'ని స్పష్టం చేశారు.

చిన్న చిన్న పనులు చేసేందుకు కూడా నిర్లక్ష్యం వహిస్తున్నారని, మీ పనితీరును సమీక్షించుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ వచ్చి కలవాలంటే కుదరదని అన్నారు. వారు వస్తేనే పని చేస్తామనే విధానాన్ని విడనాడాలని ఆమె సూచించారు. ప్రభుత్వోద్యోగులుగా మీరే వారివద్దకు వెళ్లి సర్టిఫికెట్లు అందజేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సమస్యతో వచ్చిన వారికి పరిష్కారం చూపించాలని ఆమె స్పష్టం చేశారు. 

  • Loading...

More Telugu News