: స్వైన్ ఫ్లూ మృతులు ఐదుగురే అంటున్న ఢిల్లీ ప్రభుత్వం.. 40కి పైనే అంటున్న ఆసుపత్రులు


స్వైన్ ఫ్లూ మరణాలను కప్పిపుచ్చుకునేందుకు ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందా? పలు ఆసుపత్రుల నివేదికలు పరిశీలిస్తే అవుననే అనిపిస్తోంది. స్వైన్ ఫ్లూ బారినపడి ఇప్పటి వరకు ఐదుగురు మాత్రమే మరణించినట్టు అధికారిక నివేదికలు చెబుతుండగా ఆసుపత్రులు మాత్రం గత రెండు నెలల్లో మరణించిన వారి సంఖ్య 40 అని చెబుతున్నాయి. మరికొన్ని ఆసుపత్రులు మాత్రం వివరాలు వెల్లడించేందుకు నిరాకరిస్తున్నాయి.

రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రి నివేదిక ప్రకారం 22 మంది మృతి చెందగా వారిలో 13 మంది ఢిల్లీకి చెందిన వారు, ఏడుగురు ఉత్తరప్రదేశ్, ఇద్దరు హరియాణా వారు. సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో 11 మంది స్వైన్ ఫ్లూతో మృతి చెందగా ఐదుగురు ఢిల్లీవాసులు. మిగతా వారు ఆ చుట్టుపక్కల రాష్ట్రాల వారు. ఇక ప్రతిష్ఠాత్మక ఎయిమ్స్ అధికారులు తమ ఆసుపత్రిలో ఒక్క ఆగస్టులోనే నలుగురు మరణించినట్టు చెబుతున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో నలుగురు చనిపోగా ముగ్గురు స్వైన్‌ ఫ్లూతో మృతి చెందారు. ఇక కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు వివరాలను చెప్పేందుకు నిరాకరించాయి.

  • Loading...

More Telugu News