: కూతురు హత్య ప్లాన్ గురించి ఇంద్రాణి ముఖర్జియా చెప్పినప్పుడు భయమేసింది: డ్రైవర్ శ్యామ్ వర్ రాయ్
షీనాబోరా హత్య పథకం గురించి ఇంద్రాణీ ముఖర్జియా చెబుతున్నప్పుడు మొదటి సారి భయమేసిందని దేశవ్యాప్తంగా కలకలం రేపిన షీనాబొరా హత్య కేసు విచారణలో న్యాయమూర్తికి అప్రూవర్ గా మారిన ఇంద్రాణి డ్రైవర్ శ్యామ్ వర్ రాయ్ తెలిపారు. ముంబై ప్రత్యేక కోర్టులో జరుగుతున్న ఈ విచారణ సందర్భంగా శ్యామ్ వర్ రాయ్ మాట్లాడుతూ, ఈ హత్యలో పాలు పంచుకున్నందుకు తాను ఆమె నుంచి డబ్బులు డిమాండ్ చేయలేదని అన్నాడు.
2012లో స్కైప్ లో హత్య గురించి ఐదారు సార్లు మాట్లాడగా, హత్య గురించి ఆమె తనకు వివరించిందని శ్యామ్ వర్ రాయ్ తెలిపాడు. కాగా, అతని విచారణ సెప్టెంబర్ 4 వరకు జరగనుంది. 2012లో హత్య జరగగా 2015 ఆగస్టులో ఈ సంచలన హత్యోదంతం వెలుగు చూసింది. శ్యామ్ వర్ రాయ్ ని విచారించగా, హత్య వివరాలు వెలుగు చూశాయి. దీంతో ఇది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.