: ట్రిపుల్ తలాక్ తీర్పుపై హర్షం వ్యక్తం చేసిన బాలీవుడ్ ప్రముఖులు


ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ విరుద్ధమంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై బాలీవుడ్ ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. ‘సుప్రీం’ తీర్పును స్వాగతిస్తున్నామని, ఎన్నో ఏళ్లుగా దీనిని రద్దు చేయాలంటూ పోరాటం చేస్తున్న సాహస మహిళ సాధించిన విజయం ఈ తీర్పు అని బాలీవుడ్ సీనియర్ నటి షబానా ఆజ్మీ అన్నారు. ప్రముఖ సీనియర్ నటుడు అనుమపర్ ఖేర్ స్పందిస్తూ, ‘సుప్రీం’ నిర్ణయం మహిళా సాధికారిత విజయమేనంటూ సంతోషం వ్యక్తం చేశారు. దేశంలో ఇది చారిత్రాత్మక రోజు అని ప్రముఖ నటి దియా మీర్జా అభిప్రాయపడింది. ముస్లిం మహిళా సాధికారికతకు ఇదొక కొత్త శకం అని ప్రముఖ దర్శకుడు మధూర్ బండార్కర్ అన్నారు. 

  • Loading...

More Telugu News