: 'రాజీవ్ గాంధీ హయాంలో ముస్లిం మహిళల పరిస్థితి అలా.. మోదీ హయాంలో ఇలా' అంటూ బీజేపీ కార్టూన్!


ముస్లిం మ‌హిళ‌ల పాలిట శాపంలా ఉన్న ట్రిపుల్ త‌లాక్‌ను స‌మ‌ర్థించ‌బోమ‌ని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ గ‌తంలో ప‌లుసార్లు వ్యాఖ్యానించిన విష‌యం తెలిసిందే. ఈ రోజు ట్రిపుల్ త‌లాక్ ప‌ద్ధ‌తిని ర‌ద్దు చేస్తూ సుప్రీంకోర్టు కీల‌క తీర్పునిచ్చిన నేప‌థ్యంలో బీజేపీ నేత‌లు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. కాగా, అప్ప‌ట్లో ముస్లింల ప‌రిస్థితి అలా ఉండేది.. ఇప్పుడు ఇలా ఉంది అంటూ ఈ రోజు బీజేపీ త‌న అధికారిక ట్విట్ట‌ర్ ఖాతాలో ఓ కార్టూన్‌ను పోస్ట్ చేసింది.

1986లో రాజీవ్ గాంధీ హ‌యాంలో దేశంలో ముస్లింల ప‌రిస్థితి దారుణంగా ఉంద‌ని, న్యాయం జ‌రిగేది కాద‌ని అందులో పేర్కొన్నారు. 2017లో మోదీ హ‌యాంలో మాత్రం ట్రిపుల్ త‌లాక్ ర‌ద్ద‌యింద‌ని ముస్లిం మ‌హిళ‌లు సంతోషంగా ఉన్న‌ట్లు ఆ కార్టూన్‌లో చూపించారు. ముస్లిం మ‌హిళ‌ల హ‌క్కుల విష‌యంలో ఇంతగా మార్పు వ‌చ్చింద‌ని పేర్కొన్నారు. ఇటీవలే ట్విట్టర్ లో భారతీయ జనతా పార్టీ ఫాలోవర్ల సంఖ్య అరవై లక్షలు దాటిపోయింది. 

  • Loading...

More Telugu News