: బాబా రామ్‌దేవ్ రియాలిటీ షోకి వ్యాఖ్యాతగా రణ్‌వీర్ సింగ్!
త్వరలో యోగా గురువు బాబా రామ్‌దేవ్ `ఓం శాంతి ఓం` అనే రియాలిటీ షో ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ స్టైలిష్ ఐకాన్ రణ్‌వీర్ సింగ్ వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. కాకపోతే తొలి ఎపిసోడ్‌కు మాత్రమే రణ్‌వీర్ వ్యాఖ్యానం చేయనున్నారు. తర్వాతి ఎపిసోడ్లకు అపరశక్తి ఖురానా వ్యాఖ్యాతగా ఉంటారు. భక్తి పాటలకు, కొత్త మ్యూజిక్ కలిపి వినిపించే పాటల పోటీగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు.
ఇందులో సోనాక్షి సిన్హా, కనికా కపూర్, శేఖర్ రావ్జీయానీలు న్యాయనిర్ణేతలుగా వుంటారు. బాబా రామ్‌దేవ్ మహాగురుగా కనిపిస్తారు. ఈ కార్యక్రమం మొదటి ఎపిసోడ్‌లో రణ్‌వీర్ తన `బాజీరావ్ మస్తానీ` సినిమాలోని భక్తి పాట `గజానన` పాడుతూ ఎంట్రీ ఇచ్చి, కార్యక్రమంలో పాల్గొనబోయే 14 మంది పార్టిసిపెంట్లను పరిచయం చేయనున్నట్లు సమాచారం.