: ఎన్నికల సంఘం చీఫ్ భన్వర్ లాల్ ను కలసిన టీడీపీ నేతలు
ఎన్నికల సంఘం చీఫ్ భన్వర్ లాల్ ను టీడీపీ నేతలు కేశినేని నాని, కొనకళ్ల నారాయణ, పల్లె రఘునాథరెడ్డిలు కలిశారు. సాక్షి టీవీలో ఎన్నికల గుర్తులను ప్రసారం చేస్తున్నారని వారు భన్వర్ లాల్ కు ఫిర్యాదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రసారాలు చేస్తున్న సాక్షి మీడియాపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
మరోవైపు పల్లె రఘునాథరెడ్డి మీడియాతో మాట్లాడుతూ జగన్ పై నిప్పులు చెరిగారు. సీఎం సీట్లో కూర్చోవడం, లక్ష కోట్లను కాపాడుకోవడంపైనే జగన్ ధ్యాసంతా ఉందని మండిపడ్డారు. ప్రజల సంక్షేమం జగన్ కు అవసరం లేదని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న మంచి పనులను... యజ్ఞాన్ని రాక్షసులు అడ్డుకున్నట్టు జగన్ అడ్డుకుంటున్నారని విమర్శించారు. జీవితకాలంలో ఎన్నటికీ జగన్ సీఎం కాలేరని అన్నారు.