: గులాబీ రంగు కోడి గుడ్లను చూసేందుకు జనాలు భారీగా క్యూ కడుతున్న వైనం!


ఓ కోడి పెట్టిన గుడ్ల‌న్నీ గులాబీ రంగులో ఉండ‌డంతో వాటిని చూడడానికి జ‌నాలు బారులు తీరుతోన్న సంఘ‌ట‌న హైద‌రాబాద్ శివారులోని హయత్ నగర్ శుభోదయ నగర్ కాలనీకి చెందిన శ్రీనివాస్‌రెడ్డి ఇంట్లో చోటు చేసుకుంది. కోడి గుడ్లు పెడితే అవి తెలుపు లేక కొద్దిగా గోధుమ రంగులో ఉంటాయి. కానీ, ఈ కోడి ఇలా గులాబీ రంగులో గుడ్లు పెట్ట‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. ఆ ఊర్లో వారంతా ఈ విష‌యాన్నే చ‌ర్చించుకుంటున్నారు. తాను ఈ కోడిని ఇటీవల‌ కొమురెల్లి మల్లన్న ఆలయం వద్ద కొన్నాన‌ని శ్రీనివాస రెడ్డి మీడియాకు చెప్పాడు.   

  • Loading...

More Telugu News