: చంద్ర‌బాబు, లోకేశ్‌పై అనుచిత పోస్టులు చేస్తున్న‌ వ్య‌క్తి అరెస్టు!


సోష‌ల్ మీడియాలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్ పై ఓ వ్య‌క్తి అనుచిత పోస్టులు చేస్తున్నాడ‌ని తెలుసుకున్న పోలీసులు అత‌డిని అరెస్టు చేసి ప‌లు సెక్ష‌న్ల కింద కేసులు పెట్టారు. చిత్తూరు జిల్లా శాంతిపురం మండలంలోని కలిగనూరు గ్రామానికి చెందిన బసవరాజు (30) అనే వ్య‌క్తి ఈ చ‌ర్య‌ల‌కు పాల్ప‌డ్డాడ‌ని పోలీసులు చెప్పారు. ఫేస్‌బుక్‌లో ‘వైఎస్ఆర్‌సీపీ అన్అఫీషియల్’ అనే పేజ్‌ని సృష్టించి చంద్ర‌బాబు, లోకేశ్ పై అస‌భ్య‌క‌ర పోస్టులు పెడుతున్నాడ‌ని, వారి ఫొటోలను మార్ఫింగ్ చేసి మహిళలు కొడుతున్నట్లు పోస్టులు చేస్తున్నాడ‌ని అన్నారు. వారితో పాటు ఎమ్మెల్యే, సినీన‌టుడు బాల‌కృష్ణపై కూడా ఆయ‌న అభ్యంత‌ర‌కర ఫొటోలు పెట్టార‌ని చెప్పారు.   

  • Loading...

More Telugu News