: చైనాకు షాకిచ్చిన మోదీ ప్రభుత్వం


చైనాకు మోదీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. యుద్ధ నినాదాలు చేస్తున్న చైనా తీరును పట్టించుకోకుండా భారత్ తన పని తాను చేసుకుపోతోంది. గత ఐదేళ్లుగా భారీ ఎత్తున దిగుమతి అవుతున్న టాంపర్డ్ గ్లాస్ పై మోదీ ప్రభుత్వం సుంకం విధించింది. స్మార్ట్ ఫోన్ స్క్రీన్లను రక్షించేందుకు ఈ టాంపర్డ్ గ్లాస్ ను వినియోగిస్తారు. భారత్ కు చైనా నుంచి దిగుమతి అయ్యే టన్ను టాంపర్డ్ గ్లాస్ పై 52.85 నుంచి 136.21 అమెరికన్ డాలర్ల సుంకాన్ని విధించనున్నట్టు రెవెన్యూ విభాగం తెలిపింది.

90.5 శాతం పారదర్శకత కలిగి, 4.2 ఎంఎం మందం మించకుండా ఉన్న టెక్స్చర్డ్ టఫెన్డ్ (టాంపర్డ్) గ్లాసులపై ఈ సుంకం విధిస్తున్నట్టు రెవెన్యూ విభాగం తెలిపింది. సాధారణ విలువతో చైనా ఈ గ్లాసులను భారత్‌ కు ఎగుమతి చేస్తోందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ యాంటీ-డంపింగ్ అండ్ అల్లైడ్ డ్యూటీస్ (డీజీఏడీ) దర్యాప్తులో తేలింది. దీని వల్ల దేశీయ పరిశ్రమకు భారీ ఎత్తున నష్టం వాటిల్లుతోందని రెవెన్యూ విభాగం వెల్లడించింది. దేశీయ పరిశ్రమకు ఊతమివ్వాలన్న ఉద్దేశంతోనే ఈ సుంకం విధించినట్టు తెలిపారు. 

  • Loading...

More Telugu News