: భారత నేవీ అమ్ముల పొదిలో... నేల మీద, సముద్రంలో పోరాడే యుద్ధనౌక


నేల మీద, సముద్రంలోనూ పోరాడగలిగేలా ఉభయచర యుద్ధ సామర్థ్యాన్ని భారత నౌకాదళం పెంచుకుంటోంది. అత్యాధునిక ‘ల్యాండింగ్‌ క్రాఫ్ట్‌ యుటిలిటీ’ (ఎల్‌సీయూ) యుద్ధనౌక భారత నౌకాదళంలో చేరింది. పోర్ట్‌ బ్లెయిర్‌ లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో అండమాన్‌, నికోబార్‌ దీవుల లెఫ్టినెంట్‌ గవర్నర్‌ జగదీశ్‌ ముఖీ ఈ సరికొత్త నౌకను నావికా దళంలోకి ప్రవేశపెట్టారు.

ఇది పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందగా, దీనిని కోల్‌ కతాలోని గార్డెన్‌ రీచ్‌ షిప్‌ బిల్డర్స్‌ అండ్‌ ఇంజినీర్స్‌ సంస్థ రూపొందించింది. ఈ యుద్ధనౌక అండమాన్‌ దీవుల్లోనే విధులు నిర్వర్తిస్తుంది. ఇదే శ్రేణికి చెందిన మరో ఆరు నౌకలు నిర్మాణం దశలో ఉండగా, మరో రెండేళ్లలో అవి వినియోగంలోకి రానున్నాయి. ఈ యుద్ధనౌకతో యుద్ధట్యాంకులు, ఇతర భారీ ఆయుధ వ్యవస్థలు, సైనిక బలగాలను యుద్ధరంగానికి రవాణా చేయవచ్చు.

  • Loading...

More Telugu News