: సోషల్ మీడియాను పిచ్చెక్కిస్తున్న విచిత్రమైన పోజు!


సాధారణంగా సోషల్ మీడియాలో సెల్పీలు, లేదా ఫోటోలు అందంగా ఆకట్టుకునేలా ఉన్న వాటిని పోస్టు చేస్తుంటాం. అలాగే ఈ మధ్య కాలంలో ఒక నెటిజన్ తాను దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇలాంటి ఫోటో జన్మలో దిగలేమంటూ నెటిజన్లు పేర్కొంటుండగా, మరికొందరు ఔత్సాహికులు ఆ ఫోటోను ఫోటోషాప్ ద్వారా ఎడిటింగ్ చేసి, వివిధ సందర్భాలకు అనుగుణంగా మార్చుతున్నారు. ఇలాంటి పోజిచ్చిన వ్యక్తిని మనం జన్మలో చూడలేమంటూ షేర్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఇది ఫేస్ బుక్, వాట్స్ యాప్ లలో వైరల్ గా మారింది. ఆ ఫోటోలో వ్యక్తి రెండు రాళ్లపై కాలు పెట్టి, మరో రాతిపై చేయిపెట్టి చిత్రంగా పోజిచ్చాడు. 

  • Loading...

More Telugu News