: భారత్, పాకిస్థాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే చాలు.. ఆ తండ్రి భయపడిపోతాడు!


ఆయన పేరు గుర్మీత్ సింగ్. పాకిస్థాన్ బోర్డర్ కు 90 కిలోమీటర్ల దూరంలోని పంజాబ్ లోని మౌలాట్ పట్టణంలో 'భారత్, పాకిస్థాన్' వుడ్ వర్కర్ కార్పెంటరీ షాప్ యజమాని అతను. విచిత్రంగా ఆయన పిల్లల పేర్లు కూడా భారత్.. పాకిస్థాన్! ఈ రెండు దేశాల మధ్య జరిగిన యుద్ధాలను ప్రత్యక్షంగా చూసిన వ్యక్తి ఆయన. అసలు ఈ రెండు దేశాలు ఒకే తల్లి బిడ్డలే అన్నది గుర్మీత్ అభిప్రాయం. అందుకే రెండు దేశాలు సఖ్యంగా వుండాలని, అన్నదమ్ముల్లా కలసిమెలసి వుండాలని కోరుకుంటూ.. తన పిల్లల్లో ఒకరికి భారత్ (11) అని, మరొకరికి పాకిస్థాన్ (10) అని పెట్టుకున్నాడు.

అయితే భారత్‌, పాకిస్తాన్‌ దేశాల మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నా, సరిహద్దుల్లో యుద్ధ ఉద్రిక్తతలు రేగినా తన పిల్లలను బయటకు పంపడు. ఎందుకంటే, ఎవరికి ఏ హాని జరుగుతుందోనని ఆందోళన చెందుతుంటాడు. అయితే పాకిస్థాన్ ను ఇంట్లో, బంధువర్గం, చుట్టుపక్కల వాళ్లు అదే పేరుతో పిలిచినా, స్కూల్లో మాత్రం అభ్యంతరం చెప్పారు. ఆ పేరు రికార్డ్స్ లో వెయ్యమని స్పష్టం చేశారు. దీంతో స్కూల్ రికార్డ్స్ లో కరణ్ దీప్ గా పెట్టారు. తమ పిల్లల్లాగే భారత్, పాకిస్థాన్ లు కూడా సోదరభావంతో మెలగాలని గుర్మీత్ సింగ్ కాంక్షిస్తున్నాడు.

  • Loading...

More Telugu News