: మా అమ్మాయి సితార డ్యాన్స్ నేర్చుకుంటోంది: నమ్రతా శిరోద్కర్
ప్రముఖ హీరో మహేశ్ బాబు - నమ్రతాశిరోద్కర్ దంపతుల గారాలపట్టి సితార డ్యాన్స్ నేర్చుకుంటోంది. ఈ సందర్భంగా నమ్రతా శిరోద్కర్ తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో ఈ విషయాన్ని పేర్కొంది. ‘హైదరాబాద్ లో ఉన్న ఒకే ఒక డ్యాన్స్ అకాడమీ నాట్య వేద.. దానిని నిర్వహిస్తున్న మాస్టర్ అరుణా బిక్షుక్ గారు, ఆమె కూతురు మహతి భిక్షుక్ గారి దీవెనలతో సితార తన స్నేహితురాలితో కలిసి మొదటి రోజు డ్యాన్స్ నేర్చుకుంది’ అని ఆ పోస్ట్ లో నమ్రత పేర్కొన్నారు.
ఈ పోస్ట్ తో పాటు ‘నాట్య వేద’లో నటరాజస్వామి విగ్రహం వద్ద సితార ఉన్న ఫొటోను, అరుణా భిక్షుక్, మహతి భిక్షుక్ వద్ద కూర్చుని ఉన్న మరో ఫొటోను నమ్రత పోస్ట్ చేశారు. కాగా, ఈ పోస్ట్ పై నెటిజన్లు స్పందిస్తూ ‘భరతనాట్యం? కూచిపూడి?’,‘సో క్యూట్ లవ్లీ ప్రిన్సెస్’ అని వ్యాఖ్యానించారు.