: నవ్వి నవ్వి... పట్టుదప్పి.. మృత్యువాత పడింది!
బిగ్గరగా నవ్వుతున్నపుడు కొన్నిసార్లు శరీరం అదుపు తప్పే అవకాశాలు ఉంటాయి. ఆ సమయంలో శరీరాన్ని నియంత్రించడం కష్టం. అలాగే అమెరికాలోని పెన్సిల్వేనియాకు చెందిన షారోన్ రెగోలి నవ్వుతూ, నవ్వుతూ అదుపు తప్పి బాల్కనీ నుంచి కిందపడి మరణించింది. ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న రెగోలి సెలవులు కావడంతో మెక్సికోలో నివసించే ఆమె స్నేహితుడి ఇంటికి వెళ్లింది.
ఇంట్లోని రెండో అంతస్తు బాల్కనీలో కూర్చుని ఏదో మాట్లాడుకుంటూ బిగ్గరగా నవ్వుతోంది. అలా నవ్వుతూ పట్టుదప్పి బాల్కనీ నుంచి కిందపడింది. తలకు తీవ్రగాయం కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. సెలవులు హాయిగా గడుపుదామని వచ్చి, రెగోలి ఇలా మృత్యువాత పడటం అందర్నీ కలచివేస్తోంది.