: అసభ్యంగా ప్రవర్తించిన అభిమానిపై ట్విట్టర్ లో ఆగ్రహం వ్యక్తం చేసిన ఇలియానా!


టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన అనంతరం బాలీవుడ్ లో పాగావేసేందుకు వెళ్లి, ఇంకా నిలదొక్కుకోని ఇలియానాకు ఊహించని అనుభవం ఎదురైంది. ఈ విషయం ట్విట్టర్ ద్వారా ఇలియానాయే బయటపెట్టింది. అభిమాని ప్రవర్తనపై ట్విట్టర్ లో ఆగ్రహం వ్యక్తం చేస్తూ, 'మనం నివసిస్తున్నది చాలా సంకుచితమైన, అల్పమైన ప్రపంచం. నేనొక పబ్లిక్‌ ఫిగర్‌ ని. బహిరంగ ప్రదేశాల్లో నాకు పెద్దగా వ్యక్తిగత జీవితం ఉండదని తెలుసు. కానీ, అంతమాత్రాన నాతో అసభ్యంగా ప్రవర్తించే హక్కు ఎవరికీ లేదు. ఈ విషయంలో అభిమాన వికారాలను నాపై చూపకండి. నేనూ ఒక మహిళనే అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి' అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా, ఇలియానా నటించిన ముబారకన్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ప్రమోషన్ లో ఆమె బిజీగా ఉంది.





  • Loading...

More Telugu News