: ఇప్పటికిప్పుడు నా పదవికి రాజీనామా చేయమంటే చేస్తా: మంత్రి అఖిలప్రియ


వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచి  టీడీపీలోకి మారి, ఆపై మంత్రి పదవిని పొందిన భూమా అఖిలప్రియ తన పదవికి రాజీనామా చేయడానికి తాను సిద్ధమని అన్నారు. ఓ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, ‘పదవి మీద నాకేమీ ఆశలేదు. ప్రజలు నా వైపున ఉన్నారనే నమ్మకం నాకు ఉంది.. 2019లో అది నిరూపితమవుతుంది. రాజీనామా చేయమని ముఖ్యమంత్రి గారు ఇప్పుడే చెబితే చేస్తాను.. నంద్యాలలో జగన్ ఎందుకు ప్రచారం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. మా తండ్రి భూమా నాగిరెడ్డిపై శిల్పామోహన్ రెడ్డి గతంలో చాలా కేసులు పెట్టారు. భూమా ఒక బ్రాండ్.. ఆ పేరు నిలబెడతాం. ప్రతిపక్షంలో ఉండలేక టీడీపీలో చేరామన్నది నిజం కాదు. పదవి కోసం.. మా నాన్న చనిపోయన మర్నాడే నేను అసెంబ్లీకి వెళ్లానన్నది కరెక్ట్ కాదు. మా నాన్న లక్ష్యాలేంటో చెప్పేందుకే ఆ రోజున అసెంబ్లీకి వెళ్లాను’ అని చెప్పుకొచ్చారు. 

  • Loading...

More Telugu News