: ప్రమాదం అంచున హైదరాబాద్ సిటీ బస్ ప్రయాణం... నెట్టింట వైరల్ అవుతున్న చిత్రమిది!


త్వరగా ఇల్లు చేరుకోవాలన్న ఆత్రుతో లేక యువ రక్తపు ఉత్సాహమో... ఆ విద్యార్థులు తమ ప్రాణాలే పణంగా ఫీట్లు చేస్తుండగా, ఓ వ్యక్తి తీసిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నగరంలో సరిపడినన్ని బస్సులు లేవన్న విషయాన్ని చెప్పకనే చెబుతోంది. హైదరాబాద్ పరిధిలోని రాంనగర్ నుంచి మెహిదీపట్నం వెళుతున్న '6 ఆర్' బస్సు ఇది. నంబర్ ఏపీ 11 జెడ్ 7593.

నారాయణగూడ, హిమాయత్ నగర్ ప్రాంతాల్లో కాలేజీ విద్యార్థులతో బస్సు నిండిపోగా, మరింతమంది ఎక్కే స్థలం లేక పలువురు ఫుట్ బోర్డుపై ఒంటికాలును పెట్టి నిలబడగా, బస్ వెనుక ముగ్గురు వేలాడుతూ అత్యంత ప్రమాదకర పరిస్థితిలో ప్రయాణించారు. అదే సమయంలో అటుగా వెళుతున్న దయాకర్ అనే వ్యక్తి, వీరి ప్రాణాంతక సాహసాన్ని ఫోటోతీసి సోషల్ మీడియాలో ఉంచారు. దురదృష్టవశాత్తూ ఏదైనా జరగకూడనిది జరిగితే, ఆ యువకుల కుటుంబాల్లో ఎంత విషాదం ఏర్పడుతుందో? ఆ ఫోటోను మీరూ చూడవచ్చు.

  • Loading...

More Telugu News