: నంద్యాలలో ప్రచారానికి తొలిసారి వచ్చిన జలీల్ ఖాన్... చూసేందుకు ప్రజల ఉత్సాహం!
'బీకామ్ లో ఫిజిక్స్' అంటూ సోషల్ మీడియాలో పాప్యులర్ అయిన టీడీపీ నేత జలీల్ ఖాన్, నంద్యాలలో ప్రచారం నిమిత్తం తొలిసారిగా వచ్చారు. నియోజకవర్గంలో ముస్లిం ఓటర్లను ఆకర్షించేందుకు టీడీపీ, జలీల్ ఖాన్ ను రంగంలోకి దించగా, జలీల్ ను చూసేందుకు ఓటర్లు ఉత్సాహం చూపిస్తున్నారు. 'బీకామ్ లో ఫిజిక్స్' అన్న పదం ప్రజల నోళ్లల్లో నానిపోవడంతో, 'ఈయనే ఆ మాటన్నది' అంటూ జలీల్ ప్రచారం చేస్తున్న ప్రాంతాల్లో ఆయన్ను చూసేందుకు వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక ప్రజల ఉత్సాహం చూసిన జలీల్ సైతం సరదాగా వారితో మాట్లాడుతూ, మైనారిటీలు తెలుగుదేశం పార్టీకి అండగా ఉండాలని కోరుతున్నారు. నంద్యాలలో జలీల్ ప్రచారం ముస్లిం ఓట్లను మరింతగా రాబడుతుందని తెలుగుదేశం సైతం ఆశిస్తోంది.