: చేతనైతే పార్టీని చీల్చు: శరద్ యాదవ్ కు నితీశ్ కుమార్ ఛాలెంజ్


తానే నిజమైన జనతాదళ్ (యు) అధినేతనని శరద్ యాదవ్ పేర్కొనడాన్ని తప్పుబట్టిన బీహార్ సీఎం నితీశ్ కుమార్, చేతనైతే పార్టీని చీల్చి చూపించాలని ఛాలెంజ్ విసిరారు. "మీ వల్ల అయితే జేడీ (యూ)ను చీల్చండి. కనీసం మూడింట రెండు వంతుల మెజారిటీ ఉందని చూపించండి" అని ఆయన అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంలో చేరాలని నిర్ణయం తీసుకున్న తరువాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

శరద్ యాదవ్ వర్గంలో ఉన్నారన్న కారణంగా రాజ్యసభ సభ్యుడు అలీ అన్వర్, మరో 21 మంది పార్టీ నాయకులను నితీశ్ కుమార్ సస్పెండ్ చేయడాన్ని శరద్ యాదవ్ తీవ్రంగా ఆక్షేపించిన సంగతి తెలిసిందే. పార్టీ సహ వ్యవస్థాపకుడిగా ఉన్న శరద్ యాదవ్ ను ఇప్పటికీ సస్పెండ్ చేయలేదన్న సంగతి తెలిసిందే. అయితే, రాజ్యసభలో పార్టీ పక్ష నేత హోదా నుంచి మాత్రం నితీశ్ ఆయన్ను తొలగించారు. ఎమ్మెల్యేల్లో 71 మంది, కౌన్సిల్ లో 30 మంది, ఇద్దరు లోక్ సభ, 9 మంది రాజ్యసభ సభ్యులంతా ఐకమత్యంతో తనతోనే ఉన్నారని, వారిని ఎవరూ తన నుంచి దూరం చేయలేరని తెలిపారు.

  • Loading...

More Telugu News