: డ్రగ్స్ తెస్తూ పట్టుబడిన ఎయిర్ ఇండియా ఉద్యోగి!
ప్రభుత్వ రంగ ఎయిర్ ఇండియా విమానంలో డ్రగ్స్ సరఫరా చేస్తూ పట్టుబడ్డాడో ఉద్యోగి. చెన్నై నుంచి న్యూఢిల్లీకి వచ్చిన విమానంలో రెండు కేజీల మరిజువానా మత్తుమందును తీసుకు వచ్చిన విమాన సిబ్బంది దాన్ని భోజన సేవలు అందించే నిమిత్తం ఏర్పాటు చేసిన వాహనం ద్వారా బయటకు తీసుకు వెళ్లేందుకు ప్రయత్నించాడు. సదరు ఉద్యోగిపై అనుమానంతో అధికారులు తనిఖీలు చేయగా మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. దీంతో అతన్ని అరెస్ట్ చేసిన ఢిల్లీ విమానాశ్రయ పోలీసులు విచారణ చేపట్టారు. ఈ విషయాన్ని ఎయిర్ ఇండియా ఓ ప్రకటన ద్వారా తెలియజేస్తూ, ఉద్యోగిని సస్పెండ్ చేసినట్టు ప్రకటించింది.